This blog is a Licensed work !

Friday 15 January 2010

నిశ్శబ్ధ ప్రళయం

ముందుమాట: ఈ కథ గుండె పోటు ఉన్నవాళ్ళు చదవరాదు !
అలగే ముందుగా 20నిలు సమయం ఉంచుకొని చుట్టు పక్కల తలుపులు వెసుకోండి...

-----

వేరులవాడ దెయ్యాలకి ప్రసిద్ధి. తెలుగు దేశం మొత్తానికి అతి పెద్ద స్మశానం అక్కడ ఉండటం వలన అయ్యుండవచ్చు. ఆ ఊరిలో government మూఢ ఆచారలని వదిలించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. వచ్చిన officerlu వికృతంగా చచ్చిపోతే, పోలీసులు వింతగా మాయం అయిపోయారు. కాని కాగితాల మీద మాత్రం అక్కడ ఒక Police Station, పంచాయతి ఆఫీసు ఉన్నట్టు ఉంటుంది. చాలా కష్టపడి అక్కడ ఒక హై స్కూల్ మాత్రం ప్రతిష్టించింది Government.
సీన్ కట్ చేస్తే హైదరాబాద్ లో : పొద్దున్నే ఆకాశవాణిలో 'సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్' అని వినిపిస్తూంది. ఈ పెద్ద మహానగరంలో ఆకాశవాణి వినాల్సిన దుస్థితి ఇంకెవరికీ రాకూడదు అంటూ ఆంజనేయుడికి దండం పెట్టుకుంటున్నాడు కర్కాటక్. ఉద్గ్యోగ వేట రీత్యా హైదరాబాద్ వచ్చిన లక్షా నూట ముప్పై ఒకటవ మనిషి ఇతను. అప్పుడప్పుడు ఇడ్లీతో అప్పుడప్పుడు మీల్స్ తో జీవనం గడుపుతున్నాడు. Qualification మాత్రం B.Tech Civil Engineering. "అదే తప్పైపోయింది, Computer Science తీస్కోని ఉంటే మా ఊరిలో కనీసం internet shop అయినా పెట్టుకునే వాడిని", అని ఎప్పుడూ వాపోతాడు. naukri లో ముప్పైరెండు construction కంపెనీలకు apply చేసాడు. ఇంకా ఒక్క జవాబు కూడా రాలేదు. రెండు రోజులు పోయాక ఒక కంపెనీ పిలిచింది. నిజానికి profile చూసి వెంటనే వచ్చి జాయిన్ అయిపోమని మరీ వచ్చింది తనకి లెటర్. కంపెనీ పేరు అనామిక constructions. ఇళ్ళు కట్టడం ఆ కంపెనీ వృత్తి, ఇందిరమ్మ పథకంకి పని చేస్తూంది. అన్ని ఊర్లకి ఉద్యోగాలు భర్తీ అయిపోయాయి, కర్కాటక్ కి వచ్చిన ఊరుని ఎవరూ తీస్కోలేదు, అదే వేరులవాడ.
"హలో"
"నాకు ఉద్యోగం వచ్చిందమ్మా", "hello"
"నాకు ఉద్యోగం వచ్చిందమ్మా", కర్కాటక్ ఆనందంకి అవధుల్లేవు.
"నిజమారా... మా బాబే...జీతం ఎంత ?"
"ఇరవై వేలు... ఇందిరమ్మ ఇళ్ళు కడుతున్న కంపనీలో వచ్చిందమ్మా"
"అబ్బో, అయితే permanent ఉద్యోగమే", గట్తిగా నవ్వాడు కర్కాటక్ .
"ఏ ఊరురా నాయన ?"
ఒక్క second nisabdam
"వేరులవాడ అంట ఖమ్మం జిల్లా లో"

వెంటనే phone కట్ అయిపొయింది !

వెంటనే రమ్మనడంతో ఇంటికి కూడా వెళ్ళలేదు కర్కాటక్ . వేరులవాడలో బస్సు దిగిన వెంటనే ఒక ముష్టివాడు ఎదురయ్యాడు..
"చిల్లర లేదమ్మా పక్కకి పో.."
"నువ్వు దేవుడ్ని నమ్ముకుంటావా బాబు ?", అడిగాడు ముష్టి వాడు
"దేవుడు పని చేస్కుంటేనే మనకి సాయం చేస్తాడు, వెళ్లి పని చేస్కో"
"అలాగా బాబూ... పనితో సంబంధం లేకుండా దేవుణ్ణి నమ్మే దారి ఒకటుంది"
"ఏంటది?"
"ఒక వారం రోజులు ఈ ఊర్లో ఉండటం !.. వెళ్లి రండి బాబు...", అని వెళ్ళిపోయాడు

గెస్ట్ హౌస్ కి వెళ్ళాడు. అది దెయ్యాల కొంపలా బూజు పట్టేసి ఉంది. పని వాడిని పిలిచి అంతా బాగు చేయించాడు కర్కాటక్. పని వాడు వెళ్ళిపోతూ "అయ్యా మీకు కావస్తే నేను watchmanగా ఉంటాను బాబు ఒక వంద రూపాయిలు ఎక్కువ ఇవ్వండి"
"watchman దేనికి? ఇక్కడ దొంగలు బాగా ఉంటారా ?"
పని వాడు ఆ ప్రశ్నకి విస్తుతపోయాడు...
"నాకు ఇప్పుడు అర్థమైంది బాబు, ఈ ఊరిలో ఉద్యోగానికి వస్తే మీరు ధైర్యవంతులనుకున్న ... కాని ఇది తెలియనితనం అని ఇప్పుడే తెలుస్తూంది"
"అంటే ?", కర్కాటక్ కి ఏమి అర్థంకాలేదు
"ఈ ఊరిలో దెయ్యాలు ఊరికే తిరుగుతాయి, అందుకే ఎవరూ ఇక్కడ ఉద్యోగం చెయ్యరు"
ఆ మాట వచ్చిన వెంటనే కిటికీ తలుపు గట్టిగా తెరుచుకుంది. కర్కాటక్ కి ఇబ్బందిగా అనిపించింది, ఎందుకో ఆ కిటికీ దగ్గరకు వెళ్ళలేదు.
"సరేలే నువ్వెళ్ళు అంతగా కావస్తే పిలుస్తా"

మూడు రోజులు అయ్యింది. ఇందిరమ్మ ఇళ్లు రెండింటికి పునాదులు వేయడానికి సిమెంట్ తెప్పించాడు కర్కాటక్ .
"ఏంది సామి ఈ ఇల్లు దేయ్యలకోసమా?", వెకిలిగా నవ్వాడు మేస్త్రి
"ఈ ఇంట్లోకి దెయ్యాలు రావు మేస్త్రి.. ఎందుకంటే ఇక్కడ ప్రతీ ఇంట్లో రాజశేఖర రెడ్డి ఆత్మ తిరుగుతూ ఉంటుంది"
మేస్త్రి గట్టిగా నవ్వాడు.... అందులో జోక్ లేకపోయినా సరే
"రోజూ బోర్ కొడుతూంది, ఇక్కడ దగ్గరగా సినిమా హాళ్ళు ఉన్నాయా ?",అడిగాడు కర్కాటక్
"ఆ ఉంది బాబు నిన్నే వచ్చింది ఘరానా మొగుడు, మన చిరంజీవి సినిమా"
చిరు పార్టీ పెట్టేసిన రోజుల్లో కూడా చిరు సినిమా ఆడిస్తున్న theatre ఎంత పాతదో అర్థం చేస్కున్నాడు తను.
సరే ఏమి లేని చోట ఆముద వృక్షమే మహా వృక్షమని ఆ సినిమాకే వెళ్ళాడు కర్కాటక్ .

ఆ theatre పేరు చాముండి, పేరులాగే భయానకంగా ఉంది. ఘరానా మొగుడు పోస్టర్ ఉంది. టికెట్ తీస్కోడానికి వెళ్ళాడు, అక్కడ టికెట్ ఇచ్చే వాడు కనిపించలేదు. పైన బోర్డు చూసాడు, "ఇక్కడ టికెట్ తీస్కోబడదు సినిమా ఫ్రీ గా చూడవచ్చు" అని ఉంది. అంతా చీకటిగా ఉంది.
కాని అక్కడే మతలబు జరిగింది. బయట పోస్టర్ ఘరానా మొగుడు ఉంది. వెళ్లి లోపల కూర్చుంటే 'మర్రిచెట్టు' సినిమా వస్తూంది, అది కూడా 2nd షో. ఆ అంధకారంలో ఎం చెయ్యాలో తోచక సినిమా చూడటం మొదలుపెట్టాడు.

నిజానికి ఆ theatre owner చనిపోయి రెండేళ్ళు అయ్యిందని, మూతబడిన ఆ theatre లో ఇంకా సినిమాలు వేస్తూంది అతని దెయ్యమే అని ఆ ఊరిలో కొంత మందికే తెలుసు. వాళ్ళు చచ్చిపోయారు !!!

సినిమా అయిపొయింది....... అతని వెన్నులో వణుకు వస్తూంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి.
ఒకటి, ఆ రోజు చలి వనికిస్తూంది.
రెండు, ఆ హాల్లో ఎవరూ లేరు, అది దెయ్యం సినిమా.

మూడు, అతనికి ఆ theatre లో పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించింది !

గబగబా బయటికి వచ్చాడు, నిశబ్ద ప్రళయం లాగా ఉంది అక్కడంతా. ఊరిలోకి నడవటం మొదలుపెట్టాడు. దూరంలో ఒక స్ట్రీట్ లైట్ వేసి ఉంది. ఆ దారి గుండా నడిచాడు. అక్కడే ఒక బోర్డు దాటాడు. ఆ బోర్డు లో
ఏముందో అని వెనక్కి చూసాడు.

"ఆంధ్ర దేశపు అతి పెద్ద స్మశానానికి స్వాగతం"

గొంతు వణికింది.....అక్కడ కరెంటు పోయింది.
దేవుణ్ణి నమ్ముకొనే దారి చెప్పిన ముష్టి వాడు గుర్తు వచ్చాడు. ఆ భయానక సన్నివేశంలో దేవుడు మాత్రం గుర్తు రావట్లేదు. మెల్లగా ముందుకు నడుస్తున్నాడు, తనకి ఒకటి అర్థమవుతూంది.... దాదాపు వంద మీటర్ల దూరం నడిస్తే స్మశానం దాటెయ్యచ్చు. వంద మీటర్లు..... మీటర్ మీటర్ కి తన గుండె శబ్దం గట్టిగా వినిపిస్తూంది.

నడక వేగం పెరిగింది, తన అడుగుల చప్పుడు తప్ప కనీసం కీచురాళ్ళ శబ్దం కూడా వినిపించట్లేదు, తను గుండె ఆగితే తన అడుగుల శబ్దం వల్లే అన్నట్టు ఉంది. అందుకే....

తను నడుస్తున్న కొద్దీ తన అడుగుల శబ్దం వినిపించడం ఆగిపోయింది.

తను నడుస్తున్నాడు, నడుస్తూ అరుస్తున్నాడు కానీ ఆ అరుపు వినబదట్లేదు.

"ఆగు మిత్రమా...", వెనక నుండి వచ్చిన మాట ఇది.

అప్పుడు వచ్చింది అరుపు కర్కాటక్ గొంతులో నుండి.... స్మశానంలో దెయ్యాలు అన్నింటికీ నిద్రాభంగం కలిగేలాగా !
సున్నితమైన ఆ దెయ్యం మాట ఇప్పుడు కఠోరంగా వినిపించింది.

"ఆగరా..."

కర్కాటక్ పరిగెట్టాడు. పరిగెడుతూనే తన భుజం మీద ఎవరో వేసిన చేతిని గమనించాడు...!
గట్టిగా పట్టుకుని విదిలించాడు... ఇంకా 25 మీటర్ల దూరం ఉంది.
ఇంతలో అంతా నిసబ్ధంగా మారింది, తన అడుగుల చప్పుడు వెనక్కి వచ్చింది. చీకటి మరింత పెరిగింది. ఎదురుగా దీపంతో తెల్ల చీరలో ఒక స్త్రీ నుంచుని ఉంది. తన పరుగు తగ్గింది. ఆ స్త్రీ గాల్లో కదులుతూంది. దగ్గరకి వస్తూంది. ఇంకా 20 మీటర్లు ఉంది .

అతను నెమ్మదిగా పరిగెడుతున్నాడు. "మిత్రమా, నా భార్య భోజనానికి పిలుస్తూంది", వెనక మళ్లీ అదే గొంతు. పరుగు పెరిగింది. ఎదుటుగా స్త్రీ దగ్గరకి వస్తూంది. ఆడపిల్ల ఏడుపులు గట్టిగా వినిపించడం మొదలుపెట్టాయి. ఆ స్త్రీ కేసి చూసాడు ఆమెకి కళ్ళు లేవు.

ఇంకా 10 మీటర్లు ఉంది. ఆ స్త్రీని పక్కనుండి తప్పించుకోబోయాడు, కాలు రాయికి తగిలి కింద పడ్డాడు. తన కాళ్ళ ఎదురుగా ఏదో సన్నగా కదిలింది... గల్లిలోకి చూసాడు . అస్థిపంజరం... దానికి పుర్రె లేదు!
గట్టిగా ఆ అస్థిపంజరాన్ని తోసాడు. తన కాలు ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది.. "మిత్రమా రా మిత్రమా" అంటూంది అది. గట్టిగా ఆ చెయ్యి లాగాడు. చెయ్యి చేతిలోకి వచ్చింది. అది చెయ్యి మాత్రమే.
కొద్దిపాటి దూరంలో ఉన్న ఆ స్త్రీని చూసాడు. ఆమెకి కళ్ళు లేవు, కాని కళ్ళల్లో ఆ భయానకం కనిపిస్తూంది. తను లేచాడు... లేచి పరిగెట్టాడు... ఆ స్త్రీ వేగం మీద గాలిలో కదలటం ప్రారంభించింది. ఇంకా 5 మీటర్లు దూరం ఉంది. ఆ చెయ్యి పరిగెట్టడం ప్రారంభించింది. ఇంకా 4 మీటర్లు ఉంది. స్మశానం గేట్లు మూసుకుంటున్నాయి, ఇంకా 3 మీటర్లు ఉంది. ఆ స్త్రీ దగ్గరకి వచ్చేసింది, చెయ్యి కర్కాటక్ పీక పట్టేసింది. ఇంకా 2 మీటర్లు ఉంది. గేట్లు దగ్గరకి మూసుకుంటున్నాయి ఇంకా 1 మీటర్ ఉంది.

అప్పుడు ఒకడు ఎదురుగా ప్రత్యక్షమయ్యి బిగ్గరగా నవ్వాడు. గేటు మూసుకుపోయింది, స్త్రీ పీక మీద పళ్ళు పెట్టి రక్తం పీల్చింది. ఆ గాఢ అంధకారంలో గావుకేక గాల్లో కలిసిపోయింది.
ఆ బిగ్గరగా నవ్వుతున్న బైరాగి ఆ రోజు బస్టాప్లో కలిసిన ముష్టి వాడు...

5 comments:

  1. hmmm.... good writing style.... keep it up...!!!

    ReplyDelete
  2. Haai Kesav ...super gaa raasaav Blog..!!
    Highli8s chuduu marii..:



    దేవుణ్ణి నమ్ముకొనే దారి చెప్పిన ముష్టి వాడు గుర్తు వచ్చాడు. ఆ భయానక సన్నివేశంలో దేవుడు మాత్రం గుర్తు రావట్లేదు.//dhini ki gattiga navveesaa... naaku picha picha ga nachindhi ..

    మీటర్ మీటర్ కి తన గుండె శబ్దం గట్టిగా వినిపిస్తూంది..//atmosphere baagaa creat cheesav..!! baagaa uthkantatha penchaav..!!

    Climax inkaastha spark vuntee baagunduu..!! ..still its a good posting kesav..!!


    DhaaTEyachhu...spelling mistake :P
    KaTOram ga..speling mistake once again...!

    YSR aathma gurinchi kaakundaa inkeedhaina vuntee baagundu... aa Poor joke place loo..!

    Over all the 3 out of 5..!!

    Thank you

    Regards
    Guru Charan Sharwany

    ReplyDelete
  3. బాగుంది కేశవ్ ... కథ చెప్పిన తీరు చాలా బాగుంది ... ఒక కథా రచయితకి ఉండాల్సిన లక్షణాలు నీలో చాలా ఉన్నాయి ... నువ్వాశించిన భయం పండిందో లెదో అనే అంశాన్ని పక్కన పెడితే , కథా నాయకుడి పేరు మాత్రం చాల ఫన్నీగా ఉంది ... కర్కాటక్ .. హ హ హ

    P.s : టైటిల్ ని "నిశ్శబ్ధ ప్రళయం" గా సవరించ వల్సిందిగా సూచన , take care of typos :)

    ReplyDelete
  4. masth undi ra!!!
    wish you all the besht! :)

    ReplyDelete
  5. Bagundi keshav katha.. Nee trademark twist emanna untundemo climax lo anukunna.. Thank god, "Nidralonchi ulikkipadi lechadu Karkatak" aneyaledu :)
    Keep writing :D

    ReplyDelete