This blog is a Licensed work !

Saturday 21 November 2009

మౌన రాగం...

pre requisite : ఒక 20 ని||లు ఖాళీ సమయం !


-----------------------

అతని పేరు కౌంటర్ బాబు... అవును కౌంటర్ బాబు..
చిన్నప్పుడు వాళ్ళమ్మ కౌంటర్ లో ఫారం నింపుతూంటే పురిటినొప్పులు వచ్చాయి.... అందుకని తనకి కౌంటర్ బాబు అనే పేరు. ఏ క్షణాన ఆ పేరు పెట్టారో, తనతో మాట్లాడిన ప్రతీ ఒక్కరికీ నోటి మీద వాతలు పడేలా కౌంటర్లు వేసేవాడు !!
చిన్నప్పుడు పక్కింటి ఆంటీ కౌంటర్ బాబుని చూసి ముచ్చటపడి "ఎరా చాక్లెట్ తింటావా బిస్కట్ తింటావా ?" అంటే "ముందు, మొన్న వారం మా ఇంట్లో దొబ్బేసిన మట్టుగిన్నె తెచ్చిపెట్టు అప్పుడు చెప్తాను" అన్నాడు !

------------------------------
-----------------------

ఆమె పేరు హిందోళా. ఆమె ఒక సింగర్ అవ్వటానికి చాలా కష్టాలు పడింది. అందరూ త్యాగరాజ కృతులను పాడగలరు, అందరూ గమకాలు తీయగలరు కానీ ఎవ్వరూ ఆమెలా మగ-ఆడ గొంతును మార్చి మార్చి పాడలేరు ! అంత వైవిధ్యమైన గాయిని ఆమె.
సినిమాల్లో ఆమె హీరో పాటలు కూడా కలిపి సగం పైగా పాటలు ఆమెకి ఇచ్చేయడం వల్ల... గాయకుల సంఘం, ఆమె స్టూడియోకి వస్తున్న తరుణంలో టైరులో గాలి తీసేసి, ఆలస్యం చేయించి ఆ నేరం పైన ఆమెని తెలుగు సినిమా నుండి బహిష్కరించారు. హిందోళా ఇప్పుడు కచేరీలు ఇచ్చుకుంటూంది !

మొదట్లో ఆమె పాట వినడానికి హాలు మొత్తం సరిపోకపోయినా చాల మంది నిలబడి ఆస్వాదించేవారు. ఆ తర్వాత 'diminishing marginal utility' ప్రకారం అవి బోరు కొట్టాయి.. మెల్లగా ఆ పక్కనే స్టేడియం లో జరిగే rock showలకి జనం బాగా పెరిగారు.

ఒక రోజు ఆమె రాత్రి కచేరి చేసి బయటకి వచ్చిన వెంటనే మీడియా వాళ్ళు అందరూ చుట్టూ మూగారు.
"గిగా స్టార్ మృత్యుంజయ్ గారు మీరు పాటలు బాగా పాడతారు అన్నారు. దీని పైన మీ కామెంట్ ఏమిటి ??" అని ప్రశ్న.
"ఇందులో వింతేముంది...బాగా పాడితే బాగా పాడతారు అంటారు అంతే కదా" అనేసి హిందోళా అక్కడ నుండి వెళ్ళిపోయింది.... పాత రోజులు గుర్తోచ్చినట్టున్నాయి... ఆ రోజు కోపంగా మాట్లాడింది...

ఆ రోజు రాత్రి న్యూస్ చానల్స్ లో రకరకాల కథనాలు... "రగులుతోంది కన్నె ఎద.." అనీ, "నన్ను బతికిస్తున్నది సంగీతం కాదు... పగ.." అనీ, "గిగా స్టారా...తొక్కా..." అనీ.... ఇలా చాలా...

హీరో చెప్పిన ఉర్దేసం వేరు... హిందోళా చెప్పిన ఉర్దేసం వేరు... మీడియా చెప్పిన ఉర్దేసం వేరు.... కనీ అభిమానుల ఉర్దేసం మాత్రం ఉద్రేకంతో నిండిపోయి ఉంది...
ఆ మరుసటి రోజు అభిమానులు కోడి గుడ్లు టమోటాలతో హాల్ లోపలి వచ్చారు... ఈ విష్యం ఎవరికీ తెలియదు... ఆమె కచేరి ఇస్తూంది...ప్రేక్షకుల్లో ఒకతను కుర్చీలో నుండి లేచి అర్గానయ్జర్ తో ఏదో చెప్పాడు.... అతను హిందోళా వద్దకి వచ్చి వెళ్లిపొమ్మన్నాడు.... అభిమానులతో తర్వాతా విష్యం సెటిల్ చేస్కున్నాడు...

ఆ తర్వాత...యాభై మంది కూడా కచేరికి వచ్చే వారు కాదు. కచేరి ఆపుచేసిన అతను మాత్రం వస్తూ ఉండేవాడు. ఒక్కొక్క సారి మధ్యలో వెళ్ళిపోయేవాడు. మంచి పాట వచ్చినా సరే. ఆర్గనైజర్ చాల ఇబ్బంది పడేవాడు. వేరే దారి చూసుకోమనే వాడు. ఇంకొక వారం ఆగి చూద్దామని ఆగారు...

ఒక రోజున ఆవిడ పాటలు వినటానికి ఎవరూ రాలేదు. ఆమె ఇంకో ఐదు నిముషాలు చూద్దాం అని అనుకుంది. అప్పుడు వచ్చాడు.. ఆరోజు కచేరి ఆపుచేసిన అతను. అతనే కౌంటర్ బాబు... అతని కోసం పాడింది, మూడు గంటలు పాడింది... ఆమెకి అలసట రాలేదు... ఆనందం వేసింది. చీకటి గుహలో ఎక్కడో ఒక చివరిన కనిపించిన వెలుగులా. కౌంటర్ బాబు మూడో గంట అవ్వగానే అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

కౌంటర్ బాబు మూడో గంట అవ్వగానే అక్కడ నుండి వెళ్ళిపోయాడు...
ఆర్చేస్త్రా వాళ్లకి ఎం అర్థమవ్వలేదు...ఆమె పాట ఆపుచేసింది... రోడ్డు మీద నడుస్తున్న అతనితో నడవాలని అనుకుంది... అయితే అతను తింగరి అని ఆమెకు తెలిదు !!!

------------------------------
-------------------------------

హి: "ఏమండి ఒక్క సారి ఆగండి.."
అతను ఆగాడు...

హి: "మీరు అల్లా వెళ్ళిపోయే సరికి కాస్త కంగారు వచ్చింది... పాట నచ్చలేదా ?"
కౌ: "రాత్రి పదవుతూంది... ఇలా బయట తిరగద్దు"
కొద్దిగ్గా అవక్కయ్యింది...

హి: "అలా కాదు... నాకు చాల మంది అభిమానులు ఉండేవారు...కాని మీలాంటి అభిమానులని చూడలేదు... "
కౌ: "నేను మీ అభిమానిని కాదు... మీ గొంతుకి అభిమానిని"
ఆమెకి ఈ సారీ తల తిరిగింది...

హి: "మీరు రోజు వస్తూ ఉంటారు ఎందుకని ?"
ఆఖరికి కళాకారుడు ఫ్యాన్ ని ఇంటర్వ్యూ చేసే పరిస్థితి !!
కౌ: "ఇది నా రోజువారి టైం టేబుల్ "
టైం టేబులా !...ఆమె కి ఈ సారీ కళ్ళు తిరుగుతున్నాయి..

హి: "ఓహో... మీరు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు... పాట బాగోలేదా ?"
కౌ: "చెప్పా కదా... నేను మూడు గంటలు మాత్రమే వింటాను"

హి: "మీ పేరు తెల్సుకోవచ్చా.."
కౌ : "కౌంటర్ బాబు..."
ఈ సారి ఈ కౌంటర్ కి "ఎవడు మాట్లాడితే దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే కౌంటర్ బాబు"....అనే రేంజ్ లో పడింది కౌంటర్..

హి: "మీరేం చేస్తూ ఉంటారు.."
కౌ: "ఎందుకు చెయ్యాలో ఆలోచిస్తూ ఉంటాను !!"
ఆమెకి ఏమి అర్థం కావట్లేదు... ఎం చెయ్యాలో తెలియకుండా ఎందుకు చెయ్యాలో ఆలోచించే వాడిని ఎక్కడా చూడలేదు...

హి: "అంటే వృత్తి పరంగా ఎం చేస్తూ ఉంటారు ? "
కౌ: "గంజాయి అమ్ముతూ ఉంటాను.."
ఆమె అక్కడనుండి పారిపోవాలని అనుకుంది... లేకపోతే పిచ్చిఆస్పత్రి పాలవుతుంది...కాని చిన్న సందేహం వచ్చింది...

హి: "ఏంటి మీరు పోలీసులకి దొరకరా"
కౌ: "నేను అమ్మేదే పోలీసులకి..."
లాస్ట్ ఓవర్ ఒక్క రన్ కొట్టి ఆరు వికెట్లు ఉన్న టీం ఆ ఆరు వికెట్లు కోల్పోయి ఓడిపోతే కూడా ఈమె అంత దిగ్భ్రాంతి చెందదు...

కౌంటర్ బాబు ఆమెను అర్థం చేస్కున్నట్టున్నాడు... ఈ సారి అతనే మాట్లాడాడు... "నాకు గంజాయి పెంచడం వచ్చు... పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్నా... నేరస్తులని ఎలాగైనా జైలు లో ఉంచాలనే ఉర్దేసంతో పోలీసులకి గంజాయి అమ్మి ఆ నేరస్తులపై గంజాయి స్మగ్లింగ్ కేసులో ఇరికించే పెట్టించే ప్లాన్ ఇచ్చాను...వాళ్లకి నచ్చి ఒప్పుకున్నారు ! అంతే..."

'ఇరికించడం' అనే పదం ఆమెకి ఎందుకో నచ్చలేదు...
హి: "అలా ఇరికించడం తప్పు కదా..."
కౌ: "నాకు డబ్బు కావాలి... నాకు గంజాయి పాడించడం వచ్చు... నేను పోలీసులకి దొరక్కూడదు... అయినా నేరస్తులు నేరస్తులే కదా ఇది సబబే అనిపించింది... "
హి: "అలా కాదు నేరం అనేది మనుషుల మనస్సులో ఉంటుది... అవి మార్చడానికే జైళ్ళు ఉన్నాయి... నన్ను కూడా ఇలాగే ఒక సారి ఇరికించారు..." అని తన తెలుగు సినిమా చరిత్ర చెప్పింది...

అతనికి ఎప్పుడూ లేని ఒక రకమైన అనుభూతి కలిగింది... ఆమెకు భవిష్యత్తు లేదు అని అనిపించింది... అప్పుడే సిటీ బస్సు వచ్చింది...ఆమె అందులో వెళ్ళిపోయింది !

------------------------------------

మరుసటి రోజు కచేరికి ఎవరూ రాలేదు... అతను వస్తాడని అనుకుంది... ఆగింది.. గంట ఆగింది అతడు రాలేదు ! అతను timetable తప్పని మనిషి గనుక రాడని అనుకోని ఇంటికి వెళ్ళిపోయింది... ఆ రోజుతో అది ఆమెకు ఆఖరి కచేరి అని తెలుసు...
ఇంటికి వెళ్ళింది... ఫోన్ మొగుతూంది... తాళం తీసి గబగబా వెళ్లి రిసీవ్ చేసుకొంది...
"మాడం టీవీ చూడండి.."

టీవీ లో
"గంజాయి అమ్ముతూ దొరికిపోయిన సింగర్ సుబ్బు... సింగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్"
ఆమెకు ఏమయ్యిందో అర్థమైంది... కౌంటర్ బాబుని కలవాలని అనుకుంది... అతని చిరునామా అడగలేదు, కనుక తెలియలేదు !

ఆ మరుసటి రోజు ఆ ప్రెసిడెంట్, తనే కావాలని హిందోళను బహిష్కరించాడని... తప్పు చేసాడని... చెప్పాడు...
ఆ మరుసటి రోజు ఇంకా వింతగా అతను గంజాయి అమ్మలేదని రుజువయ్యింది...

ప్రపంచం అంతటికీ ఇది వింతగా తోచింది... ఆమెకి మాత్రమే ఆ రహస్యం తెలుసు... కృతజ్ఞత భావం తో మనసు నిండిపోయింది... ఎలా చెప్పాలో తెలియట్లేదు ! ఎక్కడ ఉంటాడో అసలకే తెలియదు ! తను మళ్లీ కనిపించలేదు ! తను మళ్లీ పూర్వ వైభవం సంపాదించింది !

వారం రోజులు పోయాక ఆమెకి ఒక ఉత్తరం వచ్చింది...

"నమస్తే... నేను ఎవరో ఈ పాటికి ఊహించే ఉంటారు... ఏ లాభం లేకుండా నేను ఎవరికీ సాయపడను.... ఇప్పుడు కూడా మీకు అదే చేశాను ! మీరు నాకు చేసిన సాయం... నా ప్రశ్న కి సమాధానం ! ఎందుకు బ్రతకాలి అన్న ప్రశ్నకి సమాధానం..! ప్రేమించడానికి బ్రతకాలి... అది కూడా ఎలా తెలిసిందంటే... మీకు సాయపడాలన్న తపన వల్ల తెలిసింది !
నాది చెప్పుకోదగ్గ గతం కాదు...చిన్నప్పుడే అందరినీ వదిలోచ్చేసిన వాడిని...ఇప్పుడు వారిని కలవాలని అనిపిస్తూంది ! కాని ఎం మొహం పెట్టుకొని వెళ్ళను ? ఎం చేశాను వాళ్లకి ? ఈ బ్రతుకు ఉర్దేసం గురించి ఆలోచిస్తే బ్రతకలేం అని తెలిసింది.. మీకు చేసిన సాయం నాకు ఆనందాన్ని ఇచ్చింది...ధైర్యాన్ని ఇచ్చింది... మోక్షాన్ని ఇచ్చింది...
అందుకే హాయిగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని అనుకుని రాస్తున్న ఈ చివరి లేఖ మీకు కాసింత బాధ కలిగించిన జీవితాంతం స్మృతులతో ఆనందంగా ఉంచుతుందని ఆశిస్తున్నా.... మీరు నాకు బ్రతకడం నేర్పించారు... ఆ విష్యం మీకు తెలిదు... ఆనందమైన బ్రతుకు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నా.... మరి సెలవు ! ఇట్లు మీ... కౌంటర్ బాబు...హహ ... నా పేరు వింటే నాకే నవ్వోస్తూంది !!! "

ఆమెకి ఏమి తోచని స్థితి... నిద్ర తుంచే ఆశయం కూడా ఇంత కలవర పెట్టదు... ఎలాగైనా తనని చేరుకోవాలని ఆమె అక్కనుంది బయలుదేరింది... ఆమె ప్రయత్నం ఫలిస్తుందని ఆశిద్దాం !!

Friday 20 November 2009

నా బూజు పట్టేసిన బ్లాగ్ నుండి ఒక కథ దులిపి అందిస్తున్నా...

pre-requisites :

మీకు ఒక పావుగంట ఖాళీ ఉండాలి...

---------------------------------------------

ఒక రోజు మనోడు నిద్రపోతున్నాడు. కలలోకి తొంగి చూడగా మనోడి ఇంతి ముందు ఒక బంగారపు హంస రూపం లో ఉన్న పుష్పక విమానం నిలిచింది. మనోడు 'ఏంటా' అని అందులోకి
వెళ్ళాడు. 'ఝాం' అని ఆ విమానం శరవేగంగా ఎగిరింది. మనోడికి భయమేసింది కళ్ళు మూసాడు. కళ్ళు తెరవంగానే పెద్ద సభ, సభ బయట అంతరిక్షం !!
లోపలికి వెళ్ళాడు. ముగ్గురు అమ్మాయిలు dance చేస్తున్నారు, వాళ్ళ figureలు భూలోకం లో ఎవరికీ సాటిరావు. మనోడు అకస్మాత్తుగా కుక్కలా నాలుక బయటకి వెలాడదీసాడు.

ఇంతలో ఎవడొ సింహాసనం మీద నుండి దిగి వచ్చి,
'రావోయ్ రా' అన్నాడు.

అది అర్థంకాక మనోడు "sir ఇదేదో సినిమా సెట్టు లా ఉంది... నా దగ్గర మాంచి రసవత్తరమైన కథలున్నాయి ఒక్క ఛాన్స్ ఇవ్వండీ... " అన్నాడు.

"'హహహ... నీ హాస్యము ఈ లాస్యము కంటే బాగున్నది కదా.... నేను దేవేంద్రుణ్ణి, నువ్వు స్వర్గానికి వచ్చావు "'అన్నాడు

'అవునా ... స్వామీ నాకు ఈ ముగ్గురు భామలూ కావాలి స్వామీ',చటుక్కున వరమడిగేసాడు మనోడు

దేవెంద్రుడు ఆ ముగ్గురు నర్తకులనీ పిలిచి
'ఇతడు ఎవడో తెలుసునా..'

ఆ ముగ్గురు భామలూ మనోడి మీద చెయ్యి వేసి..
'మనోడే...' అని చిలిపిగా నవ్వారు...

మనోడు ఒక్కక్షణం గాలిలోకి తేలాడు...
ఇంతలో ఒక అశరీరవాణి పలికింది...
'దేవేంద్రా...ఒరీ పాపాత్ముడా...దైవకార్యానికి తెప్పించిన మనోడిని రంభ, ఊర్వశీ మేనకలకి ఇస్తానంటావా...వెంటనే వైకుంఠానికి తీసుకొని రా..'


----------------------------------

next scene వైకుంఠం లో...
వెలుగుతో నిండిపోయి ఉన్న మూడు స్తంభాలు ఉన్నాయి అక్కడ.... మనోడు ఇటూ అటూ చూసీ '"ఎమయ్యా విష్ణుమూర్తీ ఎక్కడ ఉన్నవ్?'", అన్నాడు...

sudden గా వాడి shock కి ఒక light స్తంభం నుండి sound వచ్చింది... 'నేనే ఆ విష్ణుమూర్తిని...నీకు లోకకళ్యాణానికి ఒక పని అప్పగించబోతున్నా'

మనోడికి అర్థంకాక.... 'నువ్ మరీ చిలిపి...'

suddenగా ఇంకొక స్తంభం నుంది sound వచ్చింది....'ఒరీ నానార్థపు వెధవా... లోకకళ్యాణం అంటే లోకానికి మంచి తలపెట్టే పని... లోకాన్ని పెళ్ళాడే పని కాదు ఇంకొకసారి ఇలాంటి అర్థాలు తీసావో నెను మూడొ కన్ను తెరుస్తా...'

మనోడికి అర్థమయ్యి.... 'సరే శివా సరే...చెప్పేదేదో తొందరగా చెప్పు...'

మూడో స్తంభం మాట్లాడింది... 'నువ్ ఏం చెయ్యాలో చెప్తా విను..'.... అని fast forward...(readers కి వినపడకూడదు మరి !)

------------------------------------

మనోడు కళ్ళు తెరిచాడు....

కళ్ళు ఎర్రబడ్డాయి.... నిద్ర ఎక్కువయ్యి కాదు.... కళ్ళల్లో జ్వాలాగ్ని ప్రవహిస్తూంది...లేచి అద్దం లో మొహం చూసాడు... అద్దం పగిలిపొయింది...

'అమ్మో' అనుకుంటూ వెళ్లి fridgeలో నీళ్ళతో కల్లమీద పోసాడు.... ఎరుపు తగ్గింది... ఆలోచన ప్రవాహాన్ని తట్టుకోలేక తలవేడెక్కింది.... మళ్ళి నీళ్ళు తలపైన పోసాడు..... తల చల్లబడింది...

మనోడు స్నేహితుడుకి phone చేసాడు... ఏదో చెప్పాడు.... అటు వైపు నుండి ఫక్కుమని నవ్వు వచ్చింది !!... మనోడి కోపంతో మొహం ఎర్రబడింది...
అటు వైపు మాట్లాడుతున్న స్నెహితునితో "నేను ఇది చెయ్యబోతున్నను.... నా ఇల్లు తాకట్టు పెట్టైనా సరే"...

స్నేహితుని నవ్వు ఆగిపోయింది !!...
"నిజమేన నువ్వనేది..." అన్నాడు

మనోడికి దొరికిందే chance..."మనకి గడ్డు రొజులు పోవాలి.... ఆ దేవుడే ఈ రూపం లో నా కలలోకి వచ్చి ఏం చెయ్యలో చెప్పడు..."

ఆ తరువాత రోజు "అఖిలాంధ్ర పోట్లకుక్కల సంఘం (AndhraPradesh MLA Assosciation)" కి ఒక parcel వచ్చింది...

అందులో ఒక casette ఉంది... tape recorder లో వేసాక
"కాయ్ రాజా కాయ్..... మంచి తరుణం మించిపోతూంది.... ఈ రోజే మీ చందా ధారపొయ్యండి... election లో ఖర్చుపెట్టే
దబ్బు కి 10 % మాకు ఇప్పిస్తే యే నియొజకవర్గంలో గెలిచిన వాడికి ఆ నియోజకవరం పోటీదారులు ఇచ్చిన డబ్బు మొత్తం మీ సొంతం.....
మీ దబ్బుని రెండింతలు... మూడింతలు చెస్కోవచ్చు... ఇదే వార్త "అఖిలాంధ్ర మొరిగే కుక్కల సంఘం (AndhraPradesh non MLA assosciation)" వారికి
కూడా చెప్పడం జరిగింది.... కావునా మీ డబ్బుని రేపు మీ వాళ్ళ చేతనే మా దగ్గరకు పంపించమని మనవి....పొద్దున్నే ruling party మనిషికి మీ డబ్బు ఇవ్వండి
ఆ సమయం లో మిగిత party వారిని ఉంచనివ్వద్దు... లెకపోతే ఎంత ఇచ్చారో తెల్సుకొని అంతకంతే ఎక్కువ opposition వారు ఖర్చు పెడతారు (ఈ మాటలు విన్న
MLAలు ఆ casette వాడు ఎంత నిజాయతీ పరుడు అని ఆనందించారు !!).... ఆలస్యం ఆశాభంగం.... ఆలోచిస్తే మీకే నష్టం..."

ఈ మాటకి అందరూ OK అన్నారు.... రెండు సంఘాల వారూ...

next day పొద్దున్నే అందరూ early గా చేరుకున్నారు సభ్యులు ఎప్పుడూ లేనట్టుగా....

అక్కడికి వచ్చాడు మనోడు....
ముందు రులింగ్ party వంతు.... మనోడు అక్కడ ఒక కార్యకర్త ని కలిసాడు...
"నీ పేరేంటి..."
"మనోడు... వెళ్ళి చెప్పు"
కార్యకర్త వెళ్ళి CM తో అన్నాడు...
"అన్న మనోడు వచ్చాడు"
CM:"ఐతే పంపు"
మనోడు వచ్చాడు.... డబ్బు తీస్కొని వెళ్ళిపోయాడు...

అలాగే అన్ని party దగ్గరా మనోడు డబ్బు తీస్కొని వెళ్ళిపోయాదు !!

అలాగే రెండవ సంఘం దగ్గర కూడా...

తర్వాత రోజు బండారం బయట పడింది.... మనోడు అందరి దగ్గరా డబ్బు నొక్కేసాడని !!
CM కూడా ఎం చెయ్యలేని స్థితి... అంతా దొంగ డబ్బు కద !!

తనని చంపించాలని plan వెసాడు.... ఇంతలొ call వచ్చింది CM కి....
MLA:"సార్.... వార్తలు చూసారా...?"

CM TV9 పెట్టాడు....
flash news లో : CM పదవికి ఒక NRI పోటీ...

tv9 music లో headlines - "మనోడు పెట్టిన కొత్త party..."


CM కి దిమ్మదిరిగింది.... ఇంక చంపితే అనుమానం తనమీద వస్తుంది !

ఇంతలో ప్రచారం హోరెత్తింది....
అందరూ ఎన్నొ వరాలు ఇస్తున్నారు... కురిపిస్తున్నారు !!

ఆఖరి రోజుకి వచ్చేసింది.... అందరూ ఇంచుమించు అవగొట్టేసారు....మనోడు ఇంకా మొదలుపెట్టలేదు...ఎంతో మంది నవ్వారు... ఎంతో మంది అడిగారు...
మనోడు ఎమి మాట్లాడలేదు...

అందరికీ తెలిపేలా... పొద్దున్న నుండి TV9 లో ఒకటే news... సాయంత్రం మనోడి agenda చూడండి...
సయంత్రం సరిగ్గ 5 గంటలకి TV9 లో super special bulliten....
5 అయ్యింది... అంధ్ర అంతా TV ముందు ఉంది...

"కష్టపడితే గాని collegeలో seat రాదు.... కొత్తదనం కొరకపోతే అసలు computer లే లేవు....ఇన్ని వరాలు కురిపించి యాభై ఏళ్ళలో చెయ్యలేనిది వచ్చే అయిదేళ్ళలో యే party చెయ్యదు.... మీ క్షేమం కోసం మనోడు ఆలోచిస్తాడు.... మనోడి మీద నమ్మకముంచి మీరు కూడా ఆలోచించండి.... మనోడు బాగ చదువుకున్నాడూ మీ కష్టాలని క్షణంలో కనిపెడతాదు..... మనోడు నష్టాలని నాశనంచేసేలా ఎదుర్కొంటాడు.... మనోడు మీ వాడు.... మీకు దెబ్బ తగిలితే మనోడు చెలిస్తాడు..... మనోడు చెలిస్తే అందరినీ కదిలిస్తాడు.... కదలడానికి వచ్చేవారు ఉంటే ఇదిగో ఇపుదే మీకు nomination మంజూరు చేస్తాను..... మీరు రైతు ఐన, రౌడీ ఐనా....మీలో నిజాయితీ ఉంటే చాలు....మీరు కమ్మయినా మాలైనా....మీలో మనిషితనం ఉంటే చాలు.... మీరు ధనికుదైనా నిరుపేదైనా....మన చుట్టుపక్కలను చక్కదిద్దితే చాలు.... రండి
చెయ్యి కలపండి..... మనోడు అనే భావనని భేదం లేకుండా నింపండి....."

అంటే ఆ క్షణాన రాష్ట్రమంతా నిశబ్దం !!!.....

మరుసటి రోజు వెయ్యి లేఖలు వచ్చాయి మనోడికి.... అందులో 500 మంది పొగిడారు.... 400 మంది పని చేస్తామన్నరు... 100 మంది తిట్టారు.... మొత్తానికి మనోడిని గెలిపించారు....

మనోడు government వచ్చాక ఎంతో మంది పుట్టిన పిల్లలకి మనోడు అని పేరు పెట్టుకున్నారు..... అలా ఎక్కువ మంది అయ్యేసరికి రాష్ట్రంలో ఎక్కడ ఏది విన్నా మనోడు
మనోడు అన్న మాటలు ఎక్కువయి అలాగే జనాలలో ఎవర్ని చూసిన మనోడు అన్న feeling కలిగింది...జనులందరూ మనోడు ఆదేశించిన బాటలో నడిచి వాళ్ళ వాళ్ళ జీవితాలకు వెలుగు వెతుక్కున్నారు !!


------ BE THE CHANGE YOU WANT TO SEE IN THE WORLD !!

మీరేనా రాసేది... @#!#@$%#@#$

నేనూ మార్గదర్శిలో చేరాను ఈ మధ్యనే ఒక కొత్త కామెడీ కథల బ్లాగ్ రాయడం మొదలపెట్టాను !

సరే 'ఇంక సూటిగా చెప్తా... సొల్లు లేకుండా.... పొల్లు పోకుండా...'