This blog is a Licensed work !

Saturday 21 November 2009

మౌన రాగం...

pre requisite : ఒక 20 ని||లు ఖాళీ సమయం !


-----------------------

అతని పేరు కౌంటర్ బాబు... అవును కౌంటర్ బాబు..
చిన్నప్పుడు వాళ్ళమ్మ కౌంటర్ లో ఫారం నింపుతూంటే పురిటినొప్పులు వచ్చాయి.... అందుకని తనకి కౌంటర్ బాబు అనే పేరు. ఏ క్షణాన ఆ పేరు పెట్టారో, తనతో మాట్లాడిన ప్రతీ ఒక్కరికీ నోటి మీద వాతలు పడేలా కౌంటర్లు వేసేవాడు !!
చిన్నప్పుడు పక్కింటి ఆంటీ కౌంటర్ బాబుని చూసి ముచ్చటపడి "ఎరా చాక్లెట్ తింటావా బిస్కట్ తింటావా ?" అంటే "ముందు, మొన్న వారం మా ఇంట్లో దొబ్బేసిన మట్టుగిన్నె తెచ్చిపెట్టు అప్పుడు చెప్తాను" అన్నాడు !

------------------------------
-----------------------

ఆమె పేరు హిందోళా. ఆమె ఒక సింగర్ అవ్వటానికి చాలా కష్టాలు పడింది. అందరూ త్యాగరాజ కృతులను పాడగలరు, అందరూ గమకాలు తీయగలరు కానీ ఎవ్వరూ ఆమెలా మగ-ఆడ గొంతును మార్చి మార్చి పాడలేరు ! అంత వైవిధ్యమైన గాయిని ఆమె.
సినిమాల్లో ఆమె హీరో పాటలు కూడా కలిపి సగం పైగా పాటలు ఆమెకి ఇచ్చేయడం వల్ల... గాయకుల సంఘం, ఆమె స్టూడియోకి వస్తున్న తరుణంలో టైరులో గాలి తీసేసి, ఆలస్యం చేయించి ఆ నేరం పైన ఆమెని తెలుగు సినిమా నుండి బహిష్కరించారు. హిందోళా ఇప్పుడు కచేరీలు ఇచ్చుకుంటూంది !

మొదట్లో ఆమె పాట వినడానికి హాలు మొత్తం సరిపోకపోయినా చాల మంది నిలబడి ఆస్వాదించేవారు. ఆ తర్వాత 'diminishing marginal utility' ప్రకారం అవి బోరు కొట్టాయి.. మెల్లగా ఆ పక్కనే స్టేడియం లో జరిగే rock showలకి జనం బాగా పెరిగారు.

ఒక రోజు ఆమె రాత్రి కచేరి చేసి బయటకి వచ్చిన వెంటనే మీడియా వాళ్ళు అందరూ చుట్టూ మూగారు.
"గిగా స్టార్ మృత్యుంజయ్ గారు మీరు పాటలు బాగా పాడతారు అన్నారు. దీని పైన మీ కామెంట్ ఏమిటి ??" అని ప్రశ్న.
"ఇందులో వింతేముంది...బాగా పాడితే బాగా పాడతారు అంటారు అంతే కదా" అనేసి హిందోళా అక్కడ నుండి వెళ్ళిపోయింది.... పాత రోజులు గుర్తోచ్చినట్టున్నాయి... ఆ రోజు కోపంగా మాట్లాడింది...

ఆ రోజు రాత్రి న్యూస్ చానల్స్ లో రకరకాల కథనాలు... "రగులుతోంది కన్నె ఎద.." అనీ, "నన్ను బతికిస్తున్నది సంగీతం కాదు... పగ.." అనీ, "గిగా స్టారా...తొక్కా..." అనీ.... ఇలా చాలా...

హీరో చెప్పిన ఉర్దేసం వేరు... హిందోళా చెప్పిన ఉర్దేసం వేరు... మీడియా చెప్పిన ఉర్దేసం వేరు.... కనీ అభిమానుల ఉర్దేసం మాత్రం ఉద్రేకంతో నిండిపోయి ఉంది...
ఆ మరుసటి రోజు అభిమానులు కోడి గుడ్లు టమోటాలతో హాల్ లోపలి వచ్చారు... ఈ విష్యం ఎవరికీ తెలియదు... ఆమె కచేరి ఇస్తూంది...ప్రేక్షకుల్లో ఒకతను కుర్చీలో నుండి లేచి అర్గానయ్జర్ తో ఏదో చెప్పాడు.... అతను హిందోళా వద్దకి వచ్చి వెళ్లిపొమ్మన్నాడు.... అభిమానులతో తర్వాతా విష్యం సెటిల్ చేస్కున్నాడు...

ఆ తర్వాత...యాభై మంది కూడా కచేరికి వచ్చే వారు కాదు. కచేరి ఆపుచేసిన అతను మాత్రం వస్తూ ఉండేవాడు. ఒక్కొక్క సారి మధ్యలో వెళ్ళిపోయేవాడు. మంచి పాట వచ్చినా సరే. ఆర్గనైజర్ చాల ఇబ్బంది పడేవాడు. వేరే దారి చూసుకోమనే వాడు. ఇంకొక వారం ఆగి చూద్దామని ఆగారు...

ఒక రోజున ఆవిడ పాటలు వినటానికి ఎవరూ రాలేదు. ఆమె ఇంకో ఐదు నిముషాలు చూద్దాం అని అనుకుంది. అప్పుడు వచ్చాడు.. ఆరోజు కచేరి ఆపుచేసిన అతను. అతనే కౌంటర్ బాబు... అతని కోసం పాడింది, మూడు గంటలు పాడింది... ఆమెకి అలసట రాలేదు... ఆనందం వేసింది. చీకటి గుహలో ఎక్కడో ఒక చివరిన కనిపించిన వెలుగులా. కౌంటర్ బాబు మూడో గంట అవ్వగానే అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

కౌంటర్ బాబు మూడో గంట అవ్వగానే అక్కడ నుండి వెళ్ళిపోయాడు...
ఆర్చేస్త్రా వాళ్లకి ఎం అర్థమవ్వలేదు...ఆమె పాట ఆపుచేసింది... రోడ్డు మీద నడుస్తున్న అతనితో నడవాలని అనుకుంది... అయితే అతను తింగరి అని ఆమెకు తెలిదు !!!

------------------------------
-------------------------------

హి: "ఏమండి ఒక్క సారి ఆగండి.."
అతను ఆగాడు...

హి: "మీరు అల్లా వెళ్ళిపోయే సరికి కాస్త కంగారు వచ్చింది... పాట నచ్చలేదా ?"
కౌ: "రాత్రి పదవుతూంది... ఇలా బయట తిరగద్దు"
కొద్దిగ్గా అవక్కయ్యింది...

హి: "అలా కాదు... నాకు చాల మంది అభిమానులు ఉండేవారు...కాని మీలాంటి అభిమానులని చూడలేదు... "
కౌ: "నేను మీ అభిమానిని కాదు... మీ గొంతుకి అభిమానిని"
ఆమెకి ఈ సారీ తల తిరిగింది...

హి: "మీరు రోజు వస్తూ ఉంటారు ఎందుకని ?"
ఆఖరికి కళాకారుడు ఫ్యాన్ ని ఇంటర్వ్యూ చేసే పరిస్థితి !!
కౌ: "ఇది నా రోజువారి టైం టేబుల్ "
టైం టేబులా !...ఆమె కి ఈ సారీ కళ్ళు తిరుగుతున్నాయి..

హి: "ఓహో... మీరు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు... పాట బాగోలేదా ?"
కౌ: "చెప్పా కదా... నేను మూడు గంటలు మాత్రమే వింటాను"

హి: "మీ పేరు తెల్సుకోవచ్చా.."
కౌ : "కౌంటర్ బాబు..."
ఈ సారి ఈ కౌంటర్ కి "ఎవడు మాట్లాడితే దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే కౌంటర్ బాబు"....అనే రేంజ్ లో పడింది కౌంటర్..

హి: "మీరేం చేస్తూ ఉంటారు.."
కౌ: "ఎందుకు చెయ్యాలో ఆలోచిస్తూ ఉంటాను !!"
ఆమెకి ఏమి అర్థం కావట్లేదు... ఎం చెయ్యాలో తెలియకుండా ఎందుకు చెయ్యాలో ఆలోచించే వాడిని ఎక్కడా చూడలేదు...

హి: "అంటే వృత్తి పరంగా ఎం చేస్తూ ఉంటారు ? "
కౌ: "గంజాయి అమ్ముతూ ఉంటాను.."
ఆమె అక్కడనుండి పారిపోవాలని అనుకుంది... లేకపోతే పిచ్చిఆస్పత్రి పాలవుతుంది...కాని చిన్న సందేహం వచ్చింది...

హి: "ఏంటి మీరు పోలీసులకి దొరకరా"
కౌ: "నేను అమ్మేదే పోలీసులకి..."
లాస్ట్ ఓవర్ ఒక్క రన్ కొట్టి ఆరు వికెట్లు ఉన్న టీం ఆ ఆరు వికెట్లు కోల్పోయి ఓడిపోతే కూడా ఈమె అంత దిగ్భ్రాంతి చెందదు...

కౌంటర్ బాబు ఆమెను అర్థం చేస్కున్నట్టున్నాడు... ఈ సారి అతనే మాట్లాడాడు... "నాకు గంజాయి పెంచడం వచ్చు... పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్నా... నేరస్తులని ఎలాగైనా జైలు లో ఉంచాలనే ఉర్దేసంతో పోలీసులకి గంజాయి అమ్మి ఆ నేరస్తులపై గంజాయి స్మగ్లింగ్ కేసులో ఇరికించే పెట్టించే ప్లాన్ ఇచ్చాను...వాళ్లకి నచ్చి ఒప్పుకున్నారు ! అంతే..."

'ఇరికించడం' అనే పదం ఆమెకి ఎందుకో నచ్చలేదు...
హి: "అలా ఇరికించడం తప్పు కదా..."
కౌ: "నాకు డబ్బు కావాలి... నాకు గంజాయి పాడించడం వచ్చు... నేను పోలీసులకి దొరక్కూడదు... అయినా నేరస్తులు నేరస్తులే కదా ఇది సబబే అనిపించింది... "
హి: "అలా కాదు నేరం అనేది మనుషుల మనస్సులో ఉంటుది... అవి మార్చడానికే జైళ్ళు ఉన్నాయి... నన్ను కూడా ఇలాగే ఒక సారి ఇరికించారు..." అని తన తెలుగు సినిమా చరిత్ర చెప్పింది...

అతనికి ఎప్పుడూ లేని ఒక రకమైన అనుభూతి కలిగింది... ఆమెకు భవిష్యత్తు లేదు అని అనిపించింది... అప్పుడే సిటీ బస్సు వచ్చింది...ఆమె అందులో వెళ్ళిపోయింది !

------------------------------------

మరుసటి రోజు కచేరికి ఎవరూ రాలేదు... అతను వస్తాడని అనుకుంది... ఆగింది.. గంట ఆగింది అతడు రాలేదు ! అతను timetable తప్పని మనిషి గనుక రాడని అనుకోని ఇంటికి వెళ్ళిపోయింది... ఆ రోజుతో అది ఆమెకు ఆఖరి కచేరి అని తెలుసు...
ఇంటికి వెళ్ళింది... ఫోన్ మొగుతూంది... తాళం తీసి గబగబా వెళ్లి రిసీవ్ చేసుకొంది...
"మాడం టీవీ చూడండి.."

టీవీ లో
"గంజాయి అమ్ముతూ దొరికిపోయిన సింగర్ సుబ్బు... సింగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్"
ఆమెకు ఏమయ్యిందో అర్థమైంది... కౌంటర్ బాబుని కలవాలని అనుకుంది... అతని చిరునామా అడగలేదు, కనుక తెలియలేదు !

ఆ మరుసటి రోజు ఆ ప్రెసిడెంట్, తనే కావాలని హిందోళను బహిష్కరించాడని... తప్పు చేసాడని... చెప్పాడు...
ఆ మరుసటి రోజు ఇంకా వింతగా అతను గంజాయి అమ్మలేదని రుజువయ్యింది...

ప్రపంచం అంతటికీ ఇది వింతగా తోచింది... ఆమెకి మాత్రమే ఆ రహస్యం తెలుసు... కృతజ్ఞత భావం తో మనసు నిండిపోయింది... ఎలా చెప్పాలో తెలియట్లేదు ! ఎక్కడ ఉంటాడో అసలకే తెలియదు ! తను మళ్లీ కనిపించలేదు ! తను మళ్లీ పూర్వ వైభవం సంపాదించింది !

వారం రోజులు పోయాక ఆమెకి ఒక ఉత్తరం వచ్చింది...

"నమస్తే... నేను ఎవరో ఈ పాటికి ఊహించే ఉంటారు... ఏ లాభం లేకుండా నేను ఎవరికీ సాయపడను.... ఇప్పుడు కూడా మీకు అదే చేశాను ! మీరు నాకు చేసిన సాయం... నా ప్రశ్న కి సమాధానం ! ఎందుకు బ్రతకాలి అన్న ప్రశ్నకి సమాధానం..! ప్రేమించడానికి బ్రతకాలి... అది కూడా ఎలా తెలిసిందంటే... మీకు సాయపడాలన్న తపన వల్ల తెలిసింది !
నాది చెప్పుకోదగ్గ గతం కాదు...చిన్నప్పుడే అందరినీ వదిలోచ్చేసిన వాడిని...ఇప్పుడు వారిని కలవాలని అనిపిస్తూంది ! కాని ఎం మొహం పెట్టుకొని వెళ్ళను ? ఎం చేశాను వాళ్లకి ? ఈ బ్రతుకు ఉర్దేసం గురించి ఆలోచిస్తే బ్రతకలేం అని తెలిసింది.. మీకు చేసిన సాయం నాకు ఆనందాన్ని ఇచ్చింది...ధైర్యాన్ని ఇచ్చింది... మోక్షాన్ని ఇచ్చింది...
అందుకే హాయిగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని అనుకుని రాస్తున్న ఈ చివరి లేఖ మీకు కాసింత బాధ కలిగించిన జీవితాంతం స్మృతులతో ఆనందంగా ఉంచుతుందని ఆశిస్తున్నా.... మీరు నాకు బ్రతకడం నేర్పించారు... ఆ విష్యం మీకు తెలిదు... ఆనందమైన బ్రతుకు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నా.... మరి సెలవు ! ఇట్లు మీ... కౌంటర్ బాబు...హహ ... నా పేరు వింటే నాకే నవ్వోస్తూంది !!! "

ఆమెకి ఏమి తోచని స్థితి... నిద్ర తుంచే ఆశయం కూడా ఇంత కలవర పెట్టదు... ఎలాగైనా తనని చేరుకోవాలని ఆమె అక్కనుంది బయలుదేరింది... ఆమె ప్రయత్నం ఫలిస్తుందని ఆశిద్దాం !!

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete