This blog is a Licensed work !

Wednesday 27 January 2010

నిర్ణయం



ముందుమాట : అమ్మాయిలని ఏడిపించే సందర్భంలో వాళ్ళు పడే ఇబ్బందిని ఒక అమ్మాయి వైపు నుండి రాసే ప్రయత్నం ఈ కథ.

-----------------------------------------------

రాత్రి ఏడయ్యింది. రోబోట్ లో సెన్సార్ బిగించడం మాత్రమే మిగిలింది. పొద్దున్న నుండీ దానికి మరమ్మతులు చేసే పని మీద ఉన్నారు పద్మ, స్వప్న, కార్తీక్. స్వప్న జాగ్రత్తగా సోల్డరింగ్ చేస్తూంటే పద్మ సెన్సార్ని పట్టుకొని ఉంది. అకస్మాత్తుగా సెల్ఫోన్ మోగింది. ఆ వైబ్రేషన్ కి సోల్డరింగ్ గన్ వెళ్ళి స్వప్న చేతికి తగిలింది.

పద్మ : "సారీ సారీ.. చెయ్యి కాలిందా ?"

స్వప్న : "పర్లేదు... చిన్నదే"

పద్మ : "హల్లో.."
అటు వైపు అమ్మ : "ఈ రోజు రాత్రి ఎప్పుడొస్తావు ?"

పద్మ : "ఆలస్యం అవుతుందమ్మా.. కనీసం పదవుతుంది"

అమ్మ : "అదేంటమ్మా... రాత్రి అలా తిరిగితే మాకు బెంగగా ఉంటుందే"

పద్మ : "లేదమ్మా మా ప్రాజక్ట్ అయిపోవాలి...నా తో స్వప్న ఉందిలే"

అమ్మ : "అయితే ఇంటికి వచ్చేటప్పుదు ఫోన్ చెయ్యు"

పద్మ : "సరే"
స్వప్న : "ఎవరు ? ఆంటీ ఆ ?"

కార్తీక్ : "పోనీ మీరు వెళ్ళిపోండి"
పద్మ : "ఓయ్...జాలి చూపిస్తున్నావా ?...ఇచ్చిన పని సరిగ్గా చెయ్ చాలు"
-----------------------------------------
అనుకున్నట్టే రాత్రి పదయ్యింది...సెన్సార్ పెట్టి రోబోట్ ని నడిపి ముగ్గురు చప్పట్లు కొట్టారు !...
పద్మ : "కార్తీక్ దారిలో ఏమైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చెయ్యు... ఇంటికి చేరగానే ఫోన్ చెయ్యు.."
నవ్వుకొని బయలుదేరారు...
ఫ్లయ్యోవర్ కి ఒక వైపు పద్మ ఇల్లు ఇంకో వైపు స్వప్న ఇల్లు... స్వప్నని ఇంట్లో దింపేసింది పద్మ...

స్వప్న అమ్మ : "ఉండిపో అమ్మా... రేపు వెళ్ళచ్చు"

ఫద్మ : "అబ్బా...ఏం అయిపోదు ఆంటీ..."

ఫ్లయ్యోవర్ ఖాళీగా ఉంది ! పచ్చని వెలుగుతో వెలిగిపోతూంది…. దాని మీద నడుపుతూంటే హాయిగా ఉంది ….
దూరంగా ఏవో కూతలు వినిపిస్తున్నాయి. శబ్దం పెద్దదవుతూంది. అప్పుడు కనిపించింది పల్సర్ మీద ముగ్గురి కోతిమూక. పద్మని దగ్గర చూసి “హ్యపీ బర్థ్ దే….” అని అరుస్తూ వెళ్ళిపోయారు…తాగేసి ఉన్నారు… పద్మా వాళ్ళకేసి చూడలేదు…కొంచెం ముందరకి వెళ్ళాక ఆ అరుపులు మళ్ళీ వినిపిస్తున్నాయి… అప్పుడు పద్మకి అర్థమయ్యింది, వాళ్ళు తన వైపే వస్తున్నారు.

తను వేగం పెంచింది. కానీ అది స్కూటీ బండి, వేగంలో బైకుకి ఏ మాత్రం సరిపోదు. వాళ్ళు దగ్గరకి వచ్చి ఏవేవో వాగారు. చుట్టుపక్కల ఎవరూ లేరు. దగ్గరగా పోటీగా వచ్చారు, ఒకడు వెనక నడ్డి మీద కొట్టాడు. తను విదిలించుకొని దూరంగా వెళ్ళింది. కొద్దిగా భయం వేసింది. ఒకడు అరుస్తూ వెనకనుండి తనని చేతిమీద గిచ్చి లాగబోయాడు. తను బ్యాలన్స్ తప్పింది. ముందుకి వెళ్ళి కిందపడిపోయింది…వాళ్ళు అరుస్తూ వెల్లిపోయారు. ఫ్లయ్యోవర్ ఖళీగా ఉంది.

తన చూడీదార్ కి మోచెయ్యి దగ్గర కన్నం పడింది. మెల్లగా అక్కడ చేతి మీద మంట వచ్చింది. దెబ్బలు తగిలాయి. లేవడానికి ఓపిక సరిపోలేదు. పక్క లేను లో ఒక లారీ వెళ్ళింది, సాయం చెయ్యలేదు. తనకి ఏడుపొచ్చింది. అక్కడే వెక్కి వెక్కి అయిదు నిముషాలు ఏడ్చేసింది . ఎలాగో కష్టపడి ఇంటికి వెళ్ళింది.

విషయం చెబితే ఇంట్లో ఆందొళన, కట్టి పడెస్తారు, తిట్టి పోస్తారు. తన ధైర్యం మీదే దెబ్బ కొడతారని భయపడింది. ఆ గాయం మీద గుడ్డ చుట్టేసి కనిపించకుండా లోపలకి వెళ్ళిపోయింది. బాండైద్ వేసుకొంది, ఒళ్ళంతా నొప్పి. ఓర్చుకుంటూంది.
India vs Australia ఆట తీక్షణంగా చూస్తున్నాడు తమ్ముడు.
గిన్నెలు సర్దుతోంది చెల్లి.
అమ్మ ఏం చేస్తూందో. ఎవ్వరి పనిలో వాళ్ళు ఉన్నారు.

ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించడం లేదు.ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే తపన లేదు. కనీసం భోజనం చేసావా అని కూడా అడగలేదు’. చిరాకు, కోపం అన్నీ మేళవించిన ఒక వేదాంతంలో ఉంది పద్మ
అమ్మ వెనక బట్టలు సర్దుతూంది….

“ఏమ్మా భోజనం చేసావా ?” అడిగింది అమ్మ. పద్మ వేదాంతాన్ని విరిచేసింది!

“లేదమ్మా”, నీరసంగా అంది.

“ఏమైందే…ఎందుకలా ఊరికే అర్థరాత్రులు దెయ్యంలా ఊరంపట తిరుగుతావు”
“ఆపమ్మా…”, అంది…

అమ్మ చెప్పిన దాంట్లో తప్పు లేదని తెలిసినా ఒప్పుకోలేని మనసుతో అంది,
ఇప్పటికే ఇబ్బందిగా మారిన రోజుని మరింత అనుభవించకూడదనే ఉర్దేశంతో అంది,
తన స్వేచ్చ, పని పట్ల ఆశక్తి మీద ఉన్న ఇష్టంతో అంది !
“సర్లే ఇంకోసారి ఇలా ఆలస్యం చేస్తే ఇంటికి రానివ్వను….వెళ్ళి స్నానం చేసి రా అన్నం పెడతా”

-------------------------------

వంకాయ కూర భలే ఉంది…

“అమ్మ…నాకు కూడా వంట నెర్పించవే”, చెల్లి సాగదీసి అడూగుతూంది…
ఛలోక్తి వేసాడు తమ్ముడు..

“మేమంతా ఏం పాపం చేసామే…చంపుదామని డిసైడయ్యావా ?”
చెల్లి మొహం ఎర్రబడింది

పద్మ, అమ్మ నవ్వుకున్నారు..ఆ నవ్వుకి చిన్న నొప్పి పుట్టి “అమ్మా” అంది !
అమ్మ : “ఏమైందే…”అని చేతికేసి చూసింది ”ఈ దెబ్బ ఏంటే ?”

పద్మ : “సోల్డరింగ్ చేస్తున్నప్పుడు గుచ్చుకుందమ్మా అందుకే బ్యాండైడ్ వేసాను”

అమ్మ : “ఎలాంటి ప్రాజెక్ట్లు చేస్తున్నావే”
తమ్ముడు చెల్లి దగ్గ్రకొచ్చారు ఎమైందో చూడటానికి…

“అక్కకి కిక్కు కావాలి మరి”, అని వెళ్ళిపోయాడు…
రాత్రి పదకుండయ్యింది…
మ్యాచ్ ఆశక్తిగా మారింది…తమ్ముడు చెల్లి టెన్షంగా చూస్తున్నారు, దాహమేస్తూంది

“ఓసేయ్ మంచినీళ్ళు తేవే”..ఆర్డరు వేసాడు చెల్లికి

“వెళ్ళి తెచ్చుకో”, బద్ధకంగా అంది

“ఏం చేస్తున్నావ్ రోజంతా తినడం తొంగోడమేగా వెళ్ళి కొంచెం పని చెయ్”

"ఓయ్ ఏంటి వాగుతున్నావ్…”

“నేను చెప్పింది నిజమే కదా”

“ఓయ్… నీ కోసం గిన్నెలు తీయాలి, అన్నం పెట్టాలి, కూరలు తేవాలి… నువ్వు మాత్రం పందిలా తగలడ్డావు ఇంట్లో”, మ్యాచ్ కంటే ఇదే ఆశక్తిగా ఉంది

“ఓయ్ దున్నపోతూ వెళ్ళి మంచి నీళ్ళుతే లేకపోతే కొడతా”

“అమ్మా…. చూడు వీడు నన్ను కొడుతున్నాడు”

పక్క గదిలో అమ్మ ;

“ఏంటి మీ గొడవ”
ఈ సారి తమ్ముడు నిజంగానే కొట్టాడు

“దొంగ దానా నిన్ను కొట్టానా?”

ఈ సారి చెల్లికి నిజంగా కోపమొచ్చింది..

“వెళ్ళి నీళ్ళు తేరా… పో వెళ్ళు”
ద్రావిడ్ సిక్షర్ కొట్టాడు… తమ్ముడు లీనమైపోయాడు

“నీళ్ళు తే పో….” అని తమ్ముడిని తోసింది

“ఏ పోవే..”
చెల్లి ఏడవటం మొదలెట్టింది..తమ్ముడికి టెన్షన్ తో పాటు కోపం వచ్చింది

“ఏంటే నీ బాధ”

“అమ్మా……..”

పక్కనే పుస్తకం చదువుకుంటున్న అక్క ఇదంతా వింటూనే ఉంది !
అమ్మ వచ్చింది…
చెల్లి వెక్కి వెక్కి ఏడుస్తూంది

అమ్మ: “ఏమైందే ?”

చెల్లి : “కొట్టాడు..”

తమ్ముడు : “ఇదే నన్ను తిట్టింది..పంది దున్నపోతు అంటూ”

అమ్మ : “అందుకని కొడతావా?”

తమ్ముడు : “లేకపోతే షేఖాండ్ ఇవ్వమంటావా?”

ఇంక అక్కకి కోపమొచ్చింది…
"ఆపరా తమ్ముడు..... నువ్వేమైనా రౌడీ అనుకుంటున్నావా ?… దానిని కొడతావా ?…చంపెస్తా…. అయినా నువ్వేంటే అలా ఏడుస్తావు... లాగి తిరిగి ఒక్కటి కొట్టక ?… ఏరా నీకోసం అన్నీ సాయం చేసి పెట్టాలా ?…నడ్డికింద పదహారేళ్ళు వచ్చాయి ఒళ్ళంతా కొవ్వే… అయినా ఏం పీకుతున్నావని ఇంట్లో వెళ్ళటం క్రికెట్ ఆడి రావటం, పుస్తకాలు తిరగేసావా ? అసలు ఎగ్జాం ఎప్పుడురా నీకు ? మ్యాచ్ కావల్సొచ్చిందా, వెళ్ళి చదువుకో లెకపోతే పడుక్కో… చంపేస్తా ఇంకో సారి చెల్లిని కొట్టావంటే…”
అమ్మ చూస్తూ ఉండిపోయింది..తమ్ముడికి కోపం వచ్చింది

“నేనేమైనా సరదాకి ఆడుతున్నానా ?.. జిల్లా స్థాయి పోటీ కోసమే కదా ఆడుతున్నా....కూరలు తేవడమే దీనికి పెద్ద పనైపోయిందా ?… అదేమైనా మహారాణా ?”
అమ్మ కలగజేసుకుంది…వెళ్ళి టీ.వీ. కట్టేసింది

“అందరూ పడుక్కోండి….ఎవరైనా గొడవ పడితే చంపేస్తా”
పద్మ పడుక్కుంది నిద్ర రావట్లేదు…

ఎందుకలా కోపమొచ్చింది ? తమ్ముణ్ణి ఎందుకలా తిట్టి చెల్లిని వెనకేసుకొచ్చా ?…
ఫ్లయ్యోవర్ లో జరిగినది మర్చిపోలెకపోతూంది తన మనసు…అవును ఎలా మర్చిపోతుంది…ఎప్పుడూ ఇలా జరుగుతుందని అనుకోలేదు కదా …

ఇంతలో ఎంత ఘోరం తప్పిందో… నిజంగా ఇలాగే ఉంటుందా లోకం…అమ్మకి ఎంత అవగాహన లేకపోతే జాగ్రత్త చెబుతుంది.. ఇలాగేనా మన దేశంలో ఆడవాళ్ళ సమస్య ఉండేది…అందుకేనా ఈ సానుభూతి ఈ రిజర్వఏషన్లు ?… మేము మనుషులమే కదా…ఎందుకలా ఆటవస్తువులా చూస్తారు… ప్రకృతిలోనే అలా రాసి పెట్టి ఉందా ?….
ఆలోచనలు ఎటో వెల్ళిపోతున్నాయి… వరదలా తన్నుకొస్తున్నాయి…సునామీలా ఎగసి పడుతున్నాయి…వాటిని దాచడానికి మెదడు సరిపోవట్లేడు… ఏడుపుని ఆపడానికి గుండె కాయట్లేదు… రక్తం వేగం పెరుగుతూంది..
అమ్మతో చెబుదామని లేచింది… నాకే ఇలా ఉంటే అమ్మ అల్లాడిపోతుందనిపించింది…
ఎలా పంపించెయ్యాలి, ఈ ఆలోచనలు ఎక్కడ కక్కెయ్యాలి….గంటలు గడుస్తున్నాయి…ఎవరికి చెప్పినా బాధపడతారనో, అందరికీ చెప్పెస్తారనో భయం !....

చివరికి ఒకతను గుర్తొచ్చాడు…అప్పుడు నిద్ర పట్టింది….

------------------------------------------------------------

అతనికి ఆ ఏరియాలో మంచి పేరు ఉంది… జనాలతో నిజాయితీగా ఉంటారు. అతని వల్ల అక్కడ పనిచేస్తున్న వాళ్ళందికీ మంచి పేరు వచ్చింది. పద్మ అతని దగ్గరకు వచ్చింది.

“నమస్తే”

“చెప్పండి ”

“నాకు నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది”

“ఏం జరిగింది ? ఎవరి మీదైనా కేసు అయితే ఎఫ్.ఐ.ఆర్ రాయాలి”

“కాదు ఎస్సై గారూ… నిన్న రాత్రి ఫ్లయ్యోవర్ మీద వస్తూంటే ముగ్గురు అబ్బాయిలు బండి మీద నడుస్తూ నన్ను తోసి
పారిపోయారు”

“బండి నంబర్ ఏదైనా చూసారా?”

“అంతా చీకటి”

“మీరు వెంటనే మాకు చెప్పాలి కదా!”

“సారీ అప్పటికి నేను షాకులో ఉన్నాను అదే కాకుండా నేను పడిపోయి ఉన్నా”

“అక్కడెవరూ లేరా ?”

“ఎవ్వరూ లేరు…ఫ్లయ్యోవర్ మీద…”

“ఐతే ఇప్పుడు ఏమి చెయ్యమంటారు ? మీ దగ్గర సాక్షం లేదే”

“ఉత్తినే చెప్పడానికి రాలేదు…ఈ ఏరెయా లో అక్కడ పోలీస్ పాట్రల్ వ్యాన్ నాకు ఎప్పుడూ కనిపించలేదు…. అలాంటి చోట్ల వాటిని పెట్టమని చెప్పడానికి వచ్చాను…”

“సరే దాని సంగతి నేను చూసుకుంటా”

“నాకు మీ మీద గౌరవం ఉంది….వచ్చే వారం దాకా చూస్తాను రాకపోతే సీ.ఐ తో మాట్లాడతాను”
ఇంతకీ మీ పేరు చెప్పండి

“నా పేరు ఎమైతేనేంటి నేను ఇక్కడ ఒక సిటిజెన్ని”

ఇప్పుదు ధైర్యం వెనక్కి వచ్చింది !

---------------------------------------------------


ఈ కథ హఫీజ్పేట ఫ్లయ్యోవర్లో జరిగిన సంఘటన నుండి ఇన్స్పిరతిఒన్ తీసుకున్నది.


Friday 15 January 2010

నిశ్శబ్ధ ప్రళయం

ముందుమాట: ఈ కథ గుండె పోటు ఉన్నవాళ్ళు చదవరాదు !
అలగే ముందుగా 20నిలు సమయం ఉంచుకొని చుట్టు పక్కల తలుపులు వెసుకోండి...

-----

వేరులవాడ దెయ్యాలకి ప్రసిద్ధి. తెలుగు దేశం మొత్తానికి అతి పెద్ద స్మశానం అక్కడ ఉండటం వలన అయ్యుండవచ్చు. ఆ ఊరిలో government మూఢ ఆచారలని వదిలించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. వచ్చిన officerlu వికృతంగా చచ్చిపోతే, పోలీసులు వింతగా మాయం అయిపోయారు. కాని కాగితాల మీద మాత్రం అక్కడ ఒక Police Station, పంచాయతి ఆఫీసు ఉన్నట్టు ఉంటుంది. చాలా కష్టపడి అక్కడ ఒక హై స్కూల్ మాత్రం ప్రతిష్టించింది Government.
సీన్ కట్ చేస్తే హైదరాబాద్ లో : పొద్దున్నే ఆకాశవాణిలో 'సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్' అని వినిపిస్తూంది. ఈ పెద్ద మహానగరంలో ఆకాశవాణి వినాల్సిన దుస్థితి ఇంకెవరికీ రాకూడదు అంటూ ఆంజనేయుడికి దండం పెట్టుకుంటున్నాడు కర్కాటక్. ఉద్గ్యోగ వేట రీత్యా హైదరాబాద్ వచ్చిన లక్షా నూట ముప్పై ఒకటవ మనిషి ఇతను. అప్పుడప్పుడు ఇడ్లీతో అప్పుడప్పుడు మీల్స్ తో జీవనం గడుపుతున్నాడు. Qualification మాత్రం B.Tech Civil Engineering. "అదే తప్పైపోయింది, Computer Science తీస్కోని ఉంటే మా ఊరిలో కనీసం internet shop అయినా పెట్టుకునే వాడిని", అని ఎప్పుడూ వాపోతాడు. naukri లో ముప్పైరెండు construction కంపెనీలకు apply చేసాడు. ఇంకా ఒక్క జవాబు కూడా రాలేదు. రెండు రోజులు పోయాక ఒక కంపెనీ పిలిచింది. నిజానికి profile చూసి వెంటనే వచ్చి జాయిన్ అయిపోమని మరీ వచ్చింది తనకి లెటర్. కంపెనీ పేరు అనామిక constructions. ఇళ్ళు కట్టడం ఆ కంపెనీ వృత్తి, ఇందిరమ్మ పథకంకి పని చేస్తూంది. అన్ని ఊర్లకి ఉద్యోగాలు భర్తీ అయిపోయాయి, కర్కాటక్ కి వచ్చిన ఊరుని ఎవరూ తీస్కోలేదు, అదే వేరులవాడ.
"హలో"
"నాకు ఉద్యోగం వచ్చిందమ్మా", "hello"
"నాకు ఉద్యోగం వచ్చిందమ్మా", కర్కాటక్ ఆనందంకి అవధుల్లేవు.
"నిజమారా... మా బాబే...జీతం ఎంత ?"
"ఇరవై వేలు... ఇందిరమ్మ ఇళ్ళు కడుతున్న కంపనీలో వచ్చిందమ్మా"
"అబ్బో, అయితే permanent ఉద్యోగమే", గట్తిగా నవ్వాడు కర్కాటక్ .
"ఏ ఊరురా నాయన ?"
ఒక్క second nisabdam
"వేరులవాడ అంట ఖమ్మం జిల్లా లో"

వెంటనే phone కట్ అయిపొయింది !

వెంటనే రమ్మనడంతో ఇంటికి కూడా వెళ్ళలేదు కర్కాటక్ . వేరులవాడలో బస్సు దిగిన వెంటనే ఒక ముష్టివాడు ఎదురయ్యాడు..
"చిల్లర లేదమ్మా పక్కకి పో.."
"నువ్వు దేవుడ్ని నమ్ముకుంటావా బాబు ?", అడిగాడు ముష్టి వాడు
"దేవుడు పని చేస్కుంటేనే మనకి సాయం చేస్తాడు, వెళ్లి పని చేస్కో"
"అలాగా బాబూ... పనితో సంబంధం లేకుండా దేవుణ్ణి నమ్మే దారి ఒకటుంది"
"ఏంటది?"
"ఒక వారం రోజులు ఈ ఊర్లో ఉండటం !.. వెళ్లి రండి బాబు...", అని వెళ్ళిపోయాడు

గెస్ట్ హౌస్ కి వెళ్ళాడు. అది దెయ్యాల కొంపలా బూజు పట్టేసి ఉంది. పని వాడిని పిలిచి అంతా బాగు చేయించాడు కర్కాటక్. పని వాడు వెళ్ళిపోతూ "అయ్యా మీకు కావస్తే నేను watchmanగా ఉంటాను బాబు ఒక వంద రూపాయిలు ఎక్కువ ఇవ్వండి"
"watchman దేనికి? ఇక్కడ దొంగలు బాగా ఉంటారా ?"
పని వాడు ఆ ప్రశ్నకి విస్తుతపోయాడు...
"నాకు ఇప్పుడు అర్థమైంది బాబు, ఈ ఊరిలో ఉద్యోగానికి వస్తే మీరు ధైర్యవంతులనుకున్న ... కాని ఇది తెలియనితనం అని ఇప్పుడే తెలుస్తూంది"
"అంటే ?", కర్కాటక్ కి ఏమి అర్థంకాలేదు
"ఈ ఊరిలో దెయ్యాలు ఊరికే తిరుగుతాయి, అందుకే ఎవరూ ఇక్కడ ఉద్యోగం చెయ్యరు"
ఆ మాట వచ్చిన వెంటనే కిటికీ తలుపు గట్టిగా తెరుచుకుంది. కర్కాటక్ కి ఇబ్బందిగా అనిపించింది, ఎందుకో ఆ కిటికీ దగ్గరకు వెళ్ళలేదు.
"సరేలే నువ్వెళ్ళు అంతగా కావస్తే పిలుస్తా"

మూడు రోజులు అయ్యింది. ఇందిరమ్మ ఇళ్లు రెండింటికి పునాదులు వేయడానికి సిమెంట్ తెప్పించాడు కర్కాటక్ .
"ఏంది సామి ఈ ఇల్లు దేయ్యలకోసమా?", వెకిలిగా నవ్వాడు మేస్త్రి
"ఈ ఇంట్లోకి దెయ్యాలు రావు మేస్త్రి.. ఎందుకంటే ఇక్కడ ప్రతీ ఇంట్లో రాజశేఖర రెడ్డి ఆత్మ తిరుగుతూ ఉంటుంది"
మేస్త్రి గట్టిగా నవ్వాడు.... అందులో జోక్ లేకపోయినా సరే
"రోజూ బోర్ కొడుతూంది, ఇక్కడ దగ్గరగా సినిమా హాళ్ళు ఉన్నాయా ?",అడిగాడు కర్కాటక్
"ఆ ఉంది బాబు నిన్నే వచ్చింది ఘరానా మొగుడు, మన చిరంజీవి సినిమా"
చిరు పార్టీ పెట్టేసిన రోజుల్లో కూడా చిరు సినిమా ఆడిస్తున్న theatre ఎంత పాతదో అర్థం చేస్కున్నాడు తను.
సరే ఏమి లేని చోట ఆముద వృక్షమే మహా వృక్షమని ఆ సినిమాకే వెళ్ళాడు కర్కాటక్ .

ఆ theatre పేరు చాముండి, పేరులాగే భయానకంగా ఉంది. ఘరానా మొగుడు పోస్టర్ ఉంది. టికెట్ తీస్కోడానికి వెళ్ళాడు, అక్కడ టికెట్ ఇచ్చే వాడు కనిపించలేదు. పైన బోర్డు చూసాడు, "ఇక్కడ టికెట్ తీస్కోబడదు సినిమా ఫ్రీ గా చూడవచ్చు" అని ఉంది. అంతా చీకటిగా ఉంది.
కాని అక్కడే మతలబు జరిగింది. బయట పోస్టర్ ఘరానా మొగుడు ఉంది. వెళ్లి లోపల కూర్చుంటే 'మర్రిచెట్టు' సినిమా వస్తూంది, అది కూడా 2nd షో. ఆ అంధకారంలో ఎం చెయ్యాలో తోచక సినిమా చూడటం మొదలుపెట్టాడు.

నిజానికి ఆ theatre owner చనిపోయి రెండేళ్ళు అయ్యిందని, మూతబడిన ఆ theatre లో ఇంకా సినిమాలు వేస్తూంది అతని దెయ్యమే అని ఆ ఊరిలో కొంత మందికే తెలుసు. వాళ్ళు చచ్చిపోయారు !!!

సినిమా అయిపొయింది....... అతని వెన్నులో వణుకు వస్తూంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి.
ఒకటి, ఆ రోజు చలి వనికిస్తూంది.
రెండు, ఆ హాల్లో ఎవరూ లేరు, అది దెయ్యం సినిమా.

మూడు, అతనికి ఆ theatre లో పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించింది !

గబగబా బయటికి వచ్చాడు, నిశబ్ద ప్రళయం లాగా ఉంది అక్కడంతా. ఊరిలోకి నడవటం మొదలుపెట్టాడు. దూరంలో ఒక స్ట్రీట్ లైట్ వేసి ఉంది. ఆ దారి గుండా నడిచాడు. అక్కడే ఒక బోర్డు దాటాడు. ఆ బోర్డు లో
ఏముందో అని వెనక్కి చూసాడు.

"ఆంధ్ర దేశపు అతి పెద్ద స్మశానానికి స్వాగతం"

గొంతు వణికింది.....అక్కడ కరెంటు పోయింది.
దేవుణ్ణి నమ్ముకొనే దారి చెప్పిన ముష్టి వాడు గుర్తు వచ్చాడు. ఆ భయానక సన్నివేశంలో దేవుడు మాత్రం గుర్తు రావట్లేదు. మెల్లగా ముందుకు నడుస్తున్నాడు, తనకి ఒకటి అర్థమవుతూంది.... దాదాపు వంద మీటర్ల దూరం నడిస్తే స్మశానం దాటెయ్యచ్చు. వంద మీటర్లు..... మీటర్ మీటర్ కి తన గుండె శబ్దం గట్టిగా వినిపిస్తూంది.

నడక వేగం పెరిగింది, తన అడుగుల చప్పుడు తప్ప కనీసం కీచురాళ్ళ శబ్దం కూడా వినిపించట్లేదు, తను గుండె ఆగితే తన అడుగుల శబ్దం వల్లే అన్నట్టు ఉంది. అందుకే....

తను నడుస్తున్న కొద్దీ తన అడుగుల శబ్దం వినిపించడం ఆగిపోయింది.

తను నడుస్తున్నాడు, నడుస్తూ అరుస్తున్నాడు కానీ ఆ అరుపు వినబదట్లేదు.

"ఆగు మిత్రమా...", వెనక నుండి వచ్చిన మాట ఇది.

అప్పుడు వచ్చింది అరుపు కర్కాటక్ గొంతులో నుండి.... స్మశానంలో దెయ్యాలు అన్నింటికీ నిద్రాభంగం కలిగేలాగా !
సున్నితమైన ఆ దెయ్యం మాట ఇప్పుడు కఠోరంగా వినిపించింది.

"ఆగరా..."

కర్కాటక్ పరిగెట్టాడు. పరిగెడుతూనే తన భుజం మీద ఎవరో వేసిన చేతిని గమనించాడు...!
గట్టిగా పట్టుకుని విదిలించాడు... ఇంకా 25 మీటర్ల దూరం ఉంది.
ఇంతలో అంతా నిసబ్ధంగా మారింది, తన అడుగుల చప్పుడు వెనక్కి వచ్చింది. చీకటి మరింత పెరిగింది. ఎదురుగా దీపంతో తెల్ల చీరలో ఒక స్త్రీ నుంచుని ఉంది. తన పరుగు తగ్గింది. ఆ స్త్రీ గాల్లో కదులుతూంది. దగ్గరకి వస్తూంది. ఇంకా 20 మీటర్లు ఉంది .

అతను నెమ్మదిగా పరిగెడుతున్నాడు. "మిత్రమా, నా భార్య భోజనానికి పిలుస్తూంది", వెనక మళ్లీ అదే గొంతు. పరుగు పెరిగింది. ఎదుటుగా స్త్రీ దగ్గరకి వస్తూంది. ఆడపిల్ల ఏడుపులు గట్టిగా వినిపించడం మొదలుపెట్టాయి. ఆ స్త్రీ కేసి చూసాడు ఆమెకి కళ్ళు లేవు.

ఇంకా 10 మీటర్లు ఉంది. ఆ స్త్రీని పక్కనుండి తప్పించుకోబోయాడు, కాలు రాయికి తగిలి కింద పడ్డాడు. తన కాళ్ళ ఎదురుగా ఏదో సన్నగా కదిలింది... గల్లిలోకి చూసాడు . అస్థిపంజరం... దానికి పుర్రె లేదు!
గట్టిగా ఆ అస్థిపంజరాన్ని తోసాడు. తన కాలు ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది.. "మిత్రమా రా మిత్రమా" అంటూంది అది. గట్టిగా ఆ చెయ్యి లాగాడు. చెయ్యి చేతిలోకి వచ్చింది. అది చెయ్యి మాత్రమే.
కొద్దిపాటి దూరంలో ఉన్న ఆ స్త్రీని చూసాడు. ఆమెకి కళ్ళు లేవు, కాని కళ్ళల్లో ఆ భయానకం కనిపిస్తూంది. తను లేచాడు... లేచి పరిగెట్టాడు... ఆ స్త్రీ వేగం మీద గాలిలో కదలటం ప్రారంభించింది. ఇంకా 5 మీటర్లు దూరం ఉంది. ఆ చెయ్యి పరిగెట్టడం ప్రారంభించింది. ఇంకా 4 మీటర్లు ఉంది. స్మశానం గేట్లు మూసుకుంటున్నాయి, ఇంకా 3 మీటర్లు ఉంది. ఆ స్త్రీ దగ్గరకి వచ్చేసింది, చెయ్యి కర్కాటక్ పీక పట్టేసింది. ఇంకా 2 మీటర్లు ఉంది. గేట్లు దగ్గరకి మూసుకుంటున్నాయి ఇంకా 1 మీటర్ ఉంది.

అప్పుడు ఒకడు ఎదురుగా ప్రత్యక్షమయ్యి బిగ్గరగా నవ్వాడు. గేటు మూసుకుపోయింది, స్త్రీ పీక మీద పళ్ళు పెట్టి రక్తం పీల్చింది. ఆ గాఢ అంధకారంలో గావుకేక గాల్లో కలిసిపోయింది.
ఆ బిగ్గరగా నవ్వుతున్న బైరాగి ఆ రోజు బస్టాప్లో కలిసిన ముష్టి వాడు...